తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు. బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ భూములు, వనరులను అమ్మేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట కట్టుబడి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని.. ఆమె ఇంటికెళ్లి కేసీఆర్ ఫ్యామిలీ కాళ్లు మొక్కిందని గుర్తు చేశారు. కానీ, కృతజ్ఞత మరిచి బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని అమ్మేసి..
రేవంత్ తన ప్రసంగంలో ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ ప్రస్తావించారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ వంటి ముఖ్యమైన ఆస్తులను అమ్మివేశారని, వైన్ షాపులు కూడా మిగల్చకుండా అమ్మేసిన తీరు.. గత బీఆఎస్ పాలన వల్ల నెలకు రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనపై విమర్శలు..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోగా, ప్రజలపై బరువు మోపిందని సీఎం రేవంత్ విమర్శించారు. త పదేళ్ల కాలంలో రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరిందని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ తలచుకుంటే రాష్ట్రానికి ఉన్న రూ.7 లక్షల కోట్లు అప్పు కట్టేయగలదని సెటైర్లు వేశారు.