వారసత్వంపై టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వ్యాఖ్యలకు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ(Kiran Bedi) స్ట్రాంగ్ కౌంటర్(Strong Counter) ఇచ్చారు. ఆడబిడ్డ అంటే భయం, వారసత్వం(Succession) గురించి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి హోస్ట్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ‘చుట్టూ ఆడపిల్లలతో నా ఇల్లు లేడీస్ హాస్టల్ లా ఉంటుంది. మగ పిల్లాడిని ఇవ్వమని చరణ్ కు చెప్పాను. వారసత్వాన్ని కొనసాగించాలని కోరిక నాకుంది. చరణ్ మళ్లీ ఆడపిల్లను కంటాడోనని భయం‘ అని చిరంజీవి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
చిరూ వ్యాఖ్యలకు కౌంటర్
చిరంజీవి వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ తాజాగా స్పందించారు. ‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’ అని ట్వీట్ చేశారు. కిరణ్ బేడీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
#Chiranjeevi ji
— Kiran Bedi (@thekiranbedi) March 3, 2025
Please start believing and realising that a daughter too is a legacy and no less.
It all depends on how u bring up the daughter and how she keeps evolving.
Please learn from parents who brought up their daughters to make a place for themselves and were well… pic.twitter.com/rpl606ruyz