మాజీ ఈఎన్సీ (ENC) మురళీధర్‌రావు (Murali Dhar Rao)ను అక్రమాస్తుల (Illegal Assets) కేసు (Case)లో పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ (Remand) విధించారు. దీంతో ఆయన్ను చంచల్‌గూడ (Chanchalguda) జైలు(Jail)కు తరలించారు. ఏసీబీ అధికారులు (ACB Officials) నిర్వహించిన సోదాల్లో, మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించారు.
మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బంజారాహిల్స్ (Banjara Hills)లోని మురళీధర్‌రావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న చర, స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. జహీరాబాద్ (Zaheerabad)లో ఉన్న 2 కెవీ విద్యుత్ ప్రాజెక్టు వందల కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి మురళీధర్‌రావు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా, బినామీ పేర్లతో పలు కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో కనుగొన్నారు. హైదరాబాద్, కరీంనగర్‌లలో ఆయన భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.







