---Advertisement---

రాజ‌కీయాల‌పై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

రాజ‌కీయాల‌పై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
---Advertisement---

సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCY) నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే చేసిన కృషిని కొనియాడుతూ, రాజకీయాలపై త‌న వైఖరిని స్పష్టం చేశారు.

‘‘సావిత్రి బాయి పూలే మహిళల విద్య కోసం చేసిన కృషి అమోఘం. నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. నేడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రి బాయి పూలేనే’’ అని రేణూ దేశాయ్ అన్నారు. అనంత‌రం ‘‘పిల్లలు తమ తల్లిదండ్రులతో కన్నా ఉపాధ్యాయులతో ఎక్కువ సమయం గడుపుతారు. వారు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగడం ఉపాధ్యాయుల బాధ్యత’’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment