రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

రిలయన్స్ ఫౌండేషన్‌ 2022లో ప్రారంభించిన అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ స‌తీమ‌ణి నీతా అంబానీ ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ స్కాలర్షిప్‌ల ద్వారా 10 సంవత్సరాల్లో 50,000 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఉన్నాయి.

2022 నుంచి ఇప్పటివరకు 28,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందించారు. కాగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా దరఖాస్తులు వచ్చినప్పుడు, 5000 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌కు ఎంపికయ్యారు.

తెలుగు విద్యార్థుల విజయం
ఈ ఏడాది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విశేషంగా ప్రతిభ కనబరిచారు. మొత్తం 1261 మంది తెలుగు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 850 మంది ఆంధ్రప్రదేశ్ (AP) నుంచి, 411 మంది తెలంగాణ (TG) నుంచి ఉన్నారు. ఇది తెలుగు విద్యార్థుల అవార్డుల్లో పెరుగుతున్న సత్తాని ప్రదర్శిస్తుంది. ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు https://scholarships.reliancefoundation.org/

Join WhatsApp

Join Now

Leave a Comment