ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తా(Rekha Gupta)ను ఢిల్లీ కొత్త ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంది. కాసేప‌టి క్రితం బీజేపీ(BJP) అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. రేఖా గుప్తా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాతో పాటుగా డిప్యూటీ సీఎం (Delhi Deputy CM)గా ప‌ర్వేశ్ వ‌ర్మ‌, ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా విజేంద‌ర్ గుప్తా ప్ర‌మాణం చేయ‌నున్నారు. సీఎంతో పాటు మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వం కోసం రామ్‌లీలా మైదానం ముస్తాబైంది.

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. 27 ఏళ్ల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. ఈ విజయం అనంతరం ఢిల్లీకి మ‌హిళా ముఖ్య‌మంత్రిని నియ‌మించాల‌ని అధిష్టానం కొన్ని రోజులుగా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. అంద‌రి అభిప్రాయాల స్వీక‌ర‌ణ అనంత‌రం కొత్త సీఎంగా రేఖా గుప్తా పేరును ఖ‌రారు చేశారు. ఎమ్మెల్యేలు సైతం రేఖాగుప్తావైపున‌కు మొగ్గు చూప‌గా, ఎంపిక ఖ‌రారైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment