RCB స్టార్ యశ్ దయాల్ సీక్రెట్ వెడ్డింగ్.. నెటిజన్లలో చర్చ

ఆర్సీబీ స్టార్ యశ్ దయాల్ సీక్రెట్ వెడ్డింగ్.. నెటిజన్లలో చర్చ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB) బౌలర్ యశ్ దయాల్ (Yash Dayal) మరోసారి వార్తల్లో నిలిచాడు. వ్యక్తిగత జీవితంలోని వివాదాల మధ్య అతడు ఇటీవల సీక్రెట్‌గా వివాహం (Secretly Marriage) చేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 4న నోయిడాలో (Noida) జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో శ్వేత పుండిర్‌ను యశ్ దయాల్ (Yash Dayal) పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆసక్తికరంగా, ఈ పెళ్లికి టీమిండియా లేదా ఆర్సీబీ జట్టుకు చెందిన ఆటగాళ్లు ఎవరూ హాజరు కాలేదు.

ఇదిలా ఉండగా గత ఏడాది కాలంగా యశ్ దయాల్‌పై రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదవడం వివాదానికి కారణమైంది. ఒకటి అతని మాజీ ప్రేయసి ఫిర్యాదు కాగా, మరొకటి మైనర్‌కు సంబంధించిన ఆరోపణలపై పోక్సో చట్టం (POCSO Act) కింద నమోదు అయింది. ఈ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ, తర్వాత రాజస్థాన్ హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసులు విచారణలో ఉండగా యశ్ బెయిల్‌పై బయట ఉన్నాడు.

ఇదిలా ఉండగా యశ్ దయాల్‌ను వివాహం చేసుకున్న శ్వేత పుండిర్ (Shweta Pundir) ఎవరు? అనే ప్రశ్న నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన శ్వేత ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తూ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 5.87 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, యూట్యూబ్‌లో 50 వేలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

అంతేకాకుండా ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ లీగ్‌లో బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో ఉన్న యశ్ దయాల్ ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 43 మ్యాచ్‌లలో 41 వికెట్లు తీసిన అతడు, 2025 ఐపీఎల్ టైటిల్ గెలుపులో ఆర్సీబీకి కీలక పాత్ర పోషించాడు. అయితే వివాదాల మధ్య అతని క్రికెట్ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment