రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)(RCB) ఎట్టకేలకు 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)(IPL) 2025 టైటిల్(Title)ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ సంబరాల మధ్య ఆ జట్టు మాజీ యజమాని, వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) చేసిన ట్వీట్ (Tweet) సంచలనంగా మారింది. భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన మాల్యా, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆర్‌సీబీని అభినందిస్తూ, “18 సంవత్సరాల తర్వాత ఆర్‌సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ (Champions)గా నిలిచింది. 2025 టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్‌సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందించారు.
ఎక్స్‌లో విజయ్ మాల్యాకు చేసిన ట్వీట్‌కు ఆసక్తికర రిప్లై వచ్చింది. దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్ (Kirti Nagar)లోని ఎస్‌బీఐ బ్రాంచ్ (SBI Branch)కు ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్” అని రిప్లై చేయగా, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) మాల్యా ట్వీట్‌కు ఎస్‌బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లైని కోట్ చేస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.
మాల్యా ట్వీట్‌తో ఈ సంబరాలు మరింత ఆసక్తికరంగా మారాయి. “ఈ సలా కప్ నమ్దు” (Ee Sala Cup Namde) అనే నినాదం ఇప్పుడు నిజమైందని అభిమానులు ఆనందంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.