రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తొలగించిన తరువాత, ఇప్పుడు రూ.5000 నోటు రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇలాంటి నోట్లు ప్రవేశపెట్టే యోచన లేదని స్పష్టం చేసింది. పుకార్లను నమ్మొద్దని ప్రజలకు సూచించింది.

భారీ కరెన్సీకి భారత చరిత్ర
భారతదేశంలో రూ.10,000 మరియు రూ.5,000 నోట్ల చరిత్ర 1938 నుంచి ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ తొలిసారి ఈ నోట్లు ప్రవేశపెట్టింది. ఇవి ఎక్కువగా వ్యాపారులు అధిక విలువల లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు బ్రిటీష్ ప్రభుత్వం వీటిని రద్దు చేసింది.

1978లో పెద్ద నోట్ల రద్దు
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో ఆర్థిక అవకతవకలను అరికట్టేందుకు రూ.5,000, రూ.10,000 నోట్లను పూర్తిగా రద్దు చేసింది. ఈ నోట్ల వినియోగం సామాన్య ప్రజల దైనందిన జీవితంలో తక్కువగా ఉండడంతో, ఈ చర్య పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇప్పటి పరిస్థితి
ప్రస్తుతం చలామణిలో ఉన్న అతిపెద్ద నోటు రూ.500. ఇంకా రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు అందుబాటులో ఉన్నాయి. 2023 మేలో ఆర్బీఐ, రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించి 98.12% నోట్లు వెనక్కి తెచ్చింది. ప్రస్తుతం రూ.6,691 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్ద ఉన్నట్లు వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment