టాలీవుడ్ (Tollywood) లో ఇటీవల రీరిలీజ్‌ల సందడి పెరిగిపోయింది. హీరోల పుట్టినరోజులు, సినిమా విడుదలై సిల్వర్‌జూబ్లీ పూర్తిచేసుకుందని ఇలా అరుదైన సందర్భాలను ఎంచుకొని ఆ హీరోల సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలను థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్‌ల సందడిలోకి మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja) చిత్రం కూడా చేరింది.
రవితేజ నటించిన ఎమోషనల్ క్లాసిక్ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ (Naa Autograph Sweet Memories)’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న రీరిలీజ్ (Re-Release) అవుతుండగా, తాజాగా మేకర్స్ ట్రైలర్ (Trailer) ను విడుదల చేశారు. 2004లో విడుదలైన ఈ చిత్రంలో రవితేజ సరసన గోపిక, భూమిక, మల్లిక ప్రధాన పాత్రల్లో నటించారు. జీవితంలోని తీపి గుర్తులను, విభిన్న ప్రేమకథలను నెమరేసే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను తెగ ఎమోషనల్ చేసింది.
ఇప్పుడు మళ్లీ 21 ఏళ్ల (21 Years) తర్వాత ఈ సినిమా థియేటర్లకు (Theatres) వస్తుండటంతో, అప్పటి జ్ఞాపకాల్లో తేలిపోవాలనుకునే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. కనువిందు చేసే విజువల్స్, హార్ట్‌టచింగ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. చిన్ననాటి ప్రేమకథలు, తీపి మధుర జ్ఞాపకాలను మళ్లీ తడిసి ముద్దయ్యేలా చేయనున్న ఈ సినిమా, మరొకసారి థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నట్లు ట్రైలర్ రెస్పాన్స్ ద్వారా అర్థమవుతోంది.