దీపావళి (Diwali) పండుగకు ముందు గుజరాత్(Gujarat) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) నాయకత్వంలో శుక్రవారం అట్టహాసంగా 26 మందితో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) జరిగింది. ఈ విస్తరణలో అనూహ్యంగా పలువురు కొత్త ముఖాలకు చోటు దక్కగా, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సతీమణి రివాబా జడేజా (Rivaba Jadeja) మంత్రి (Minister) గా ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు.
కొత్త కేబినెట్‌లో కీలక మార్పులు:
గురువారం రోజున ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా పాత మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించగా, కొద్ది గంటల వ్యవధిలోనే 26 మందితో కూడిన కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో హర్ష్ సంఘవి (Harsh Sanghavi) కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా, పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేసి, పరిపాలనలో కొత్త శక్తిని నింపడానికి ఈ విస్తరణ జరిగినట్లుగా తెలుస్తోంది.
182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు. తాజాగా 26 మందితో విస్తరించిన ఈ మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కించుకున్నవారు, సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినవారు ఉన్నారు.








