టీమిండియా (Team India) ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో 2000 పరుగులు, 100 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో 89 పరుగులు చేయడం ద్వారా జడేజా ఈ ఘనతను సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.
జడేజా రికార్డులు – స్టోక్స్‌తో పోలిక
2021లో WTC ప్రారంభమైనప్పటి నుండి రవీంద్ర జడేజా ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు ఆడి 2010 పరుగులు, 132 వికెట్లు పడగొట్టాడు. WTCలో మూడు సెంచరీలు సాధించిన జడ్డూ, బౌలింగ్‌లో ఆరు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రమే జడేజాకు దగ్గరలో ఉన్నాడు. స్టోక్స్ WTCలో 2000 కంటే ఎక్కువ పరుగులు (55 మ్యాచ్‌ల్లో 3365 పరుగులు) చేసినప్పటికీ, 100 వికెట్లు తీయలేదు (86 వికెట్లు). కేవలం 41 మ్యాచ్‌ల్లోనే 2000 పరుగులు చేసి, 100 వికెట్లు తీసిన జడేజా, తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కీలక ఇన్నింగ్స్
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో లోయర్ ఆర్డర్ పతనం తర్వాత రవీంద్ర జడేజా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 211 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయినప్పుడు జడ్డూ బ్యాటింగ్‌కు వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అండగా నిలవడమే కాకుండా, వీరిద్దరూ కలిసి 203 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, జడేజా 11 పరుగుల తేడాతో తన సెంచరీని కోల్పోయాడు. జోష్ టంగ్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.