మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ 2004 విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్‌ను ఎస్. గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ హార్ట్ టచ్చింగ్ మూవీలో భూమిక, గోపిక, మల్లిక, కనిహా హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే ఈ సినిమాకు విశేషమైన ఫాలోయింగ్ ఉండగా, రీ రిలీజ్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ హృదయానికి హత్తుకునే కథను ఆస్వాదించే అవకాశం కలుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నా ఆటోగ్రాఫ్ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు.