ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు (Ration Card Holders) కందిపప్పు (Toor Dal) పంపిణీపై (Distribution) మరోసారి నిరాశే (Disappointment) మిగిలింది. మే నెల నుంచి ప్రతి కార్డుదారునికి కందిపప్పు ఇవ్వనున్నట్టు ప్రకటించినా.. చాలామంది ఆశగా ఎదురు చూశారు. అయితే కందిపప్పు వస్తుందని భావించిన వారికి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు ఇస్తామని గొప్పగా చెప్పినప్పటికీ.. కందిపప్పు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో రేషన్‌కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో (Ration Shops) మిగిలిన నిత్యావసర వస్తువులు (Essential Goods) సరఫరా జరుగుతున్నప్పటికీ, కందిపప్పు మాత్రం అందుబాటులో లేదు. ఏపీ పౌరసరఫరాల సంస్థ (AP Civil Supplies Corporation) నుంచి సరఫరా నిలిచిపోయిందని సమాచారం. అంతేకాక, డీలర్లు (Dealers) కూడా ప్రభుత్వం ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం వల్ల ఈ జాప్యం జరిగినట్టు చెబుతున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో 50 శాతానికి పడిపోయిన కందిపప్పు పంపిణీ కార్యక్రమం.. ఆ తరువాత నెల నుంచి కనుమరుగైంది. గత నాలుగు నెలలుగా రేషన్‌కార్డులు ఉన్నవారికి కేవలం బియ్యం (Rice), పంచదార (Sugar) మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు లబ్ధిదారులు.
అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్‌ను మార్చిన కూటమి ప్రభుత్వం (Coalition Government).. కందిపప్పును లబ్ధిదారులకు సక్రమంగా సరఫరా చేయలేకపోతుంది. రేషన్ వాహనాలు, దుకాణాల్లో కేవలం బియ్యం, అర కిలో పంచదార మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్‌లో కందిపప్పు ధర సామాన్య, మధ్య తరగతి ప్రజలను భయపెడుతోంది. కనీసం రేషన్ సరుకుల్లో అయినా ఇస్తారేమో అనుకుంటే గత కొన్ని నెలలుగా కందికప్పు ఊసే లేదు. ఈనెల అయినా వస్తుందేమో అని ఎదురుచూసిన రేషన్‌కార్డు దారులకు నిరాశే ఎదురైంది. ప్రతి నెలా ఇదే తంతు అవ్వడంతో రేషన్‌కార్డుదారులు సైతం ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కందిపప్పు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం, సామాన్యుల ఆందోళనకు కారణమవుతోంది.








