---Advertisement---

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..
---Advertisement---

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించనున్నాం. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేపడుతున్నాం. మరో రెండు నెలల్లో రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ మొదలవుతుంది” అని తెలిపారు.

ఈ నిర్ణయం రైతులు, వినియోగదారుల మధ్య సమతుల్యతను తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించనుంద‌ని మంత్రి చెప్పారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా నాణ్యమైన ఆహారం అందించడంలో ఈ చర్య కీలకంగా ఉంటుందని తెలిపారు.

అర్హుల‌కు రేష‌న్ కార్డులు అందించేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. దాదాపు 10 ల‌క్ష‌ల కొత్త రేష‌న్ కార్డులు సంక్రాంతి త‌ర్వాత అందించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. త‌ద్వారా 31 ల‌క్ష‌ల మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని, మ‌రో 18 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు ఇటీవ‌ల మంత్రి ఉత్త‌మ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment