నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ‌ ఘటన

నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ‌ ఘటన

అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల వసతిగృహంలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. హాస్ట‌ల్‌లో రాత్రి స‌మ‌యంలో నిద్రలో ఉన్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలుక‌ల‌ దాడిలో దాదాపు 10 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి.

శ‌నివారం ఉద‌యం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి వ్యాక్సిన్ వేశారు. అయితే, ఈ ఘటనను కాలేజీ ప్రిన్సిపల్ బయటకు వెల్లడి కాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. విద్యార్థినులు మాట్లాడుతూ, హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, అందుకే ఎలుకలు రూముల్లోకి వచ్చి ఇలా దాడులు చేస్తున్నాయని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతపై అడిగే ప్రశ్నలు మరింత పెరిగాయి. వసతిగృహాల నిర్వహణపై అధికారులు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ‌త టీడీపీ హ‌యాంలో గుంటూరులోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఓ చిన్నారిని ఎలుక‌లు కొరికి చంపేసిన ఘ‌ట‌న తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment