---Advertisement---

‘రాపో 22’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్‌

రాపో 22 నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్‌
---Advertisement---

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో22’. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండ‌గా, యువ దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని ‘సాగర్’ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన క్యారెక్టర్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సాధించుకుంది. ఇక ఇప్పుడు, న్యూ ఇయర్ స్పెషల్‌గా, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

‘మన సాగర్ గాడి లవ్వు.. మహాలక్ష్మి’ అనే స్లోగన్‌తో భాగ్యశ్రీ బోర్సే పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో భాగ్యశ్రీ చుడీదార్ ధరించి సింపుల్ లుక్‌లో అందంగా కనిపించారు. రామ్ పోతినేని ఆమెకు చున్నితో ముఖం తుడుచుకునే క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ను మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment