భర్త ఫిర్యాదుతోనే పట్టుబడిన‌ రన్యా రావు

Ranya Rao HD Images భర్త ఫిర్యాదుతోనే పట్టుబడిన‌ రన్యా రావు

బంగారం అక్ర‌మంగా త‌ర‌లిస్తూ ఎయిర్‌పోర్టులో ప‌ట్టుబ‌డిన క‌న్న‌డ న‌టి రన్యారావు కేసులో కీల‌క విష‌యాల‌ను బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రో సంచ‌ల‌న విజ‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్మగ్లింగ్ కేసులో రన్యారావు అరెస్టు వెనుక ఆమె భర్త ఫిర్యాదే ప్రధాన కారణం అని తాజా సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కుటుంబ కలహాలే అసలు కారణమా?
రన్యారావు వివాహమైన రెండు నెలలకే విదేశాలకు తరచుగా వెళ్లడం భర్త కుటుంబానికి నచ్చలేదు. మొదట రష్యా, తర్వాత దుబాయ్ వెళ్లిన ఆమెపై భ‌ర్త కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం పెరిగింది. దీంతో భర్త DRI (Directorate of Revenue Intelligence) అధికారులకు సమాచారం అందించడంతో, నిఘా పెట్టిన అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని అంశాలు బయటకు రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment