రానా, మంచు లక్ష్మిపై కేసు నమోదు!

తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం చుట్టూ వివాదం ముదురుతోంది. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, ఇప్పుడు ప్రముఖ నటులపై దృష్టి సారించారు. తాజా సమాచారం మేరకు, ప్రముఖ నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మియాపూర్ పోలీసులు రానాతో పాటు 25 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కి సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment