ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల విడుదలైన ‘రామ్ గ్లింప్స్’ విజువల్స్ ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోయాయి. సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ టీమ్ పనిచేస్తోందని ప్రచారం జరిగినప్పటికీ, టీజర్‌లోని విజువల్స్ మాత్రం నెటిజన్లను నిరాశపరిచాయి. ముఖ్యంగా VFX కృత్రిమంగా, AIతో రూపొందించినట్లుగా కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ, రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటనపై మాత్రం కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక గతంలో Prabhas నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల సమయంలో కూడా ఇలాంటి విమర్శలే వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దర్శకుడు ఓం రౌత్ స్పందించి VFXలో కీలక మార్పులు చేసి ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్ చూపించారు. ఇప్పుడు ‘రామాయణ’ మేకర్స్ ముందూ అదే సవాలు నిలిచింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్లో మెరుగులు దిద్దుతారనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.








రాధాకృష్ణా.. నీ వ్యాఖ్యలను నీ కూతురు అంగీకరిస్తుందా..? – వైసీపీ ఆగ్రహం