ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ (Bhagyashree) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Thaluka). ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కాబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ రామ్, భాగ్యశ్రీ డేటింగ్ (Dating)లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు (Rumours) చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ప్రైవేట్‌గా కలుస్తున్నారని, విదేశాలకు టూర్లకు వెళ్తున్నారంటూ రకరకాల రూమర్లు వినిపించాయి.
ఈ నేపథ్యంలో, సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ పోతినేని ఈ రూమర్లపై స్పష్టత ఇచ్చారు. ఈ డేటింగ్ వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేస్తూ, భాగ్యశ్రీ తనకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమే అని తేల్చి చెప్పారు.
ఈ రూమర్లకు కారణమైన అంశంపై రామ్ వివరణ ఇస్తూ, “నేను స్వయంగా ఈ సినిమా కోసం ఓ ప్రేమ గీతాన్ని రాశాను. భాగ్యశ్రీపై ఆసక్తి లేకుండా ఇంత మంచి పాట రాయడు కదా అని అంతా అనుకుంటున్నారు. కానీ, భాగ్యశ్రీని మా సినిమా కోసం ఎంపిక చేయకముందే నేను ఆ పాట రాశాను. సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రల మధ్య ఉన్న బలమైన బంధం కారణంగానే ఆ పాట బాగా వచ్చింది.
అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రత్యేక సంబంధం లేదు.
భాగ్యశ్రీ చాలా మంచి నటి” అని అన్నారు. నిన్న భాగ్యశ్రీ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ, రామ్ తనకు మంచి స్నేహితుడని ధృవీకరించింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.








