‘ఆంధ్ర కింగ్ తాలుకా’కు సూపర్ హిట్ టాక్!

'ఆంధ్ర కింగ్ తాలుకా'కు సూపర్ హిట్ టాక్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) సరైన విజయం కోసం చూస్తున్న తరుణంలో, ఆయన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King Thaluka) నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆశించిన ఫలితం ఇవ్వని ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాల నేపథ్యంలో, ఈ సినిమాపై రామ్‌కి గట్టి విజయం సాధించాలనే ఒత్తిడి ఉంది.

ఈ చిత్రాన్ని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు పి. మహేశ్ బాబు (P. Mahesh Babu) రూపొందించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర (Upendra) కీలక పాత్ర పోషించగా, రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ప్రీమియర్స్ వీక్షించిన ప్రేక్షకుల నుంచి ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. “చాలా రోజుల తర్వాత రామ్ మంచి కథను ఎంచుకున్నాడు”, “పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్” అంటూ తొలి షో నుంచే సానుకూల రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఈ సినిమా రామ్ పోతినేని కెరీర్‌కు మరో కీలక మలుపు కావచ్చని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అటు హక్కుల విషయంలో కూడా ఈ సినిమా పెద్ద డీల్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు భారీ ధరకు దక్కించుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో మంచి హైప్ ఉన్న నేపథ్యంలో, ఈ డిజిటల్, టీవీ హక్కుల గ్రాండ్ డీల్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment