రామ్ గోపాల్ వర్మ (RGV) చేసిన ట్వీట్లు మరోసారి వివాదానికి కేంద్రంగా మారాయి. ఈసారి టార్గెట్ అయిన సినిమా గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు భారీ కలెక్షన్లను సాధించిందని ప్రచారం జరిగినప్పటికీ, వర్మ దీనిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
సినిమా యూనిట్ ప్రకటించిన “డే వన్ 186 కోట్లు కలెక్షన్స్” నమ్మకంగా అనిపించలేదని, ఇది ఫేక్ ప్రచారం అని అన్నారు. “గేమ్ ఛేంజర్‌కు 186 కోట్లు వచ్చాయంటే, పుష్ప 2కి మొదటి రోజే 1860 కోట్లు వచ్చినట్టా?” అని వర్మ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.
I loved PUSHPA 2 but now after seeing G C I want to fall on the feet of @alluarjun and @SukumarWritings 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025
అల్లు అర్జున్‌పై ప్రశంసలు – మెగా ఫ్యాన్స్‌లో ఆగ్రహం
వర్మ ట్వీట్లలో పుష్ప 2 చిత్రంపై పొగడ్తలు ప్రత్యేకంగా కనిపించాయి. “బన్నీ, సుకుమార్ కృషి చూసిన తరువాత వారి కాళ్లకు మొక్కాలని అనిపిస్తోంది” అని చెప్పిన వర్మ, అల్లు అర్జున్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక మెగా ఫ్యామిలీపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. మెగా అభిమానులు వర్మ ట్వీట్లను ట్రోల్ చేస్తుండగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్మకు మద్దతుగా నిలుస్తున్నారు.