అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ దూరం తారాస్థాయికి చేరుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్‌వార్ బయటపడింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ (Allu Arjun)ను అన్‌ఫాలో (Instagram Unfollow) చేశారు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. గతంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సైతం అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల రిలీజ్ అయిన తండేల్ సినిమా ఇటీవల ఈవెంట్‌లోనూ అల్లు అరవింద్ చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని కామెంట్స్ చేశారు. ఆ తరువాత విమర్శలు రావడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. రామ్‌చరణ్ తన ఏకైక మేనల్లుడని, తానూ చరణ్‌కు ఏకైక మేనమామను, దయచేసి గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అల్లు అరవింద్ కోరారు. రామ్ చరణ్ బన్నీని అన్‌ఫాలో చేయడానికి ఇండస్ట్రీ పరమైన వివాదామా..? లేక కుటుంబం కలహాలా అనేది తెలియాల్సి ఉంది.
Latest news is coming#RamCharan unfollowed @alluarjun but still following allu shirish on instagram. pic.twitter.com/HLgV3GYKka
— Allu Arjun North india Fan Club (@Alluarjun_north) February 12, 2025