మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులకు ఇటీవల ట్విన్స్ జన్మించడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. వారసుడు పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా తమ కవలల పేర్లను రామ్ చరణ్ వెల్లడించారు. బాబుకు ‘శివరామ్ కొణిదెల’, పాపకు ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే వీరికి ‘క్లిన్ కారా’ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
పేర్ల వెనుక ఆధ్యాత్మిక భావన ఉందని రామ్ చరణ్ వెల్లడించారు. ‘శివరామ్’ అనే పేరులో శివుడు, రాముడు ఇద్దరి ఆశీస్సులు కలిసేలా భావించారట. అలాగే తన తండ్రి చిరంజీవి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్’లోని ‘శివ’ ఉండేలా, తన పేరు ప్రతిబింబించేలా ఈ పేరు ఎంపిక చేశారని చెప్పారు. ‘అన్వీరా దేవి’ అంటే అపారమైన ధైర్యం, దైవిక కరుణ కలిగినదనే అర్థంతో ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. మెగా వారసుల పేర్లు ప్రకటించగానే అభిమానుల్లో ఆనందం మరింత పెరిగింది.








‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’