చిరు సినిమాపై చ‌ర‌ణ్‌ ఇంట్రెస్టింగ్ ట్వీట్

చిరు సినిమాపై చ‌ర‌ణ్‌ ఇంట్రెస్టింగ్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం పెద్ది (Peddi) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఉప్పెన (Uppena) మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchibabu Sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా కనిపించనుంది. వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్ (Shivrajkumar), జగపతి బాబు (Jagapathi Babu), దివ్యేందు శర్మ (Divyendu Sharma) వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తుండ‌గా మార్చి 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

చిరంజీవి ట్రైలర్‌పై రామ్ చరణ్ స్పందన
ఇదిలా ఉండగా, రామ్ చరణ్ తాజాగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) మూవీ ట్రైలర్‌పై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. “మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి అత్యుత్తమ వినోదాన్ని అందిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ను కలిసి తెరపై చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడికి, మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు” అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో భారీ అంచనాలు
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment