మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది (Peddhi)’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో, క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మూవీ టీమ్ ‘పెద్ది’ గ్లింప్స్ (Glimpse) ను రిలీజ్ చేసింది. ఇందులో రామ్ చరణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. మాస్ లుక్ (Mass Look), మాస్ ఎలివేషన్‌తో గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. తాజాగా విడుదలైన పెద్ది గ్లింప్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను మార్చి 27, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.