మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – ‘ఉప్పెన’ సెన్సేషన్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది (Peddi)’ పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivrajkumar) కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మెగా ఫ్యాన్స్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది.
తాజా అప్‌డేట్ ప్రకారం, మైసూర్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఒక్క పాట కోసం ఏకంగా 500 మంది ప్రొఫెషనల్ డాన్సర్లను రంగంలోకి దింపడం హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ గ్రేస్, స్టైల్‌కు ఆ ఎనర్జీ తోడైతే స్క్రీన్‌పై విజువల్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని టాక్. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన మాస్ బీట్స్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ జోడవడంతో ఈ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిగ్నేచర్ స్టైల్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఇప్పటినుంచే సెలబ్రేట్ చేస్తున్నారు.







