రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్ గ్లోబల్ వైబ్

రామ్ చరణ్ 'చికిరి' సాంగ్ గ్లోబల్ వైబ్

‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi) నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి’ (Chikiri) పాట ఊహించని రీతిలో రికార్డులను సృష్టిస్తోంది. ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) సంగీతం అందించిన ఈ పాటలో, చరణ్ బ్యాట్ పట్టుకుని వేసిన అదిరిపోయే హుక్ స్టెప్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఈ స్పీడ్ స్టెప్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ‘చికిరి’ వైబ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది, ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే కనిపిస్తున్నాయి.

ఈ పాటను మోహిత్ చౌహాన్ ఆలపించగా, బాలాజీ సాహిత్యం అందించారు. ‘చికిరి’ పాట కేవలం ఇండియాలోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అద్భుతమైన స్పందన పొందింది. అంతేకాకుండా, జపాన్, నేపాల్, వెస్ట్రన్ కంట్రీస్‌లోనూ ఈ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో దీని గ్లోబల్ రీచ్ అసాధారణంగా పెరిగింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 60 మిలియన్ల వ్యూస్‌ను దాటిన ఈ సాంగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో 70K+ రీల్స్‌తో రచ్చ చేస్తోంది.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ‘పెద్ది’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment