రామచరణ్ పెద్ది సినిమా వాయిదా?

రామచరణ్ పెద్ది సినిమా వాయిదా?

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddhi) చిత్రం విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ముందుగా ప్రకటించిన రిలీజ్ తేదీకి కాకుండా, ఈ సినిమాను వేసవి 2026కి వాయిదా వేసే అవకాశమున్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో షూటింగ్ అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తికాకపోవడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ (Post-Production) పనులకు మరింత సమయం అవసరం కావడం వల్ల విడుదల తేదీ మార్పు అవసరమైందని సమాచారం.

ఇక మరో ముఖ్య కారణం బాక్సాఫీస్ వద్ద ఎదురయ్యే గట్టి పోటీ. ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌ఫ్రేమ్‌లో యష్ ‘టాక్సిక్’, నాని ‘ది ప్యారడైజ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’, అడివి శేష్ ‘డెక్కాయిట్’ వంటి పాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, కలెక్షన్లు మరియు థియేటర్ల లభ్యతపై ప్రభావం పడే అవకాశముందనే భావన మేకర్స్‌కు కలిగిందట. అందుకే సోలో రిలీజ్ విండోతో పాటు వేసవి సెలవుల బలమైన అడ్వాంటేజ్ కోసం 2026 సమ్మర్‌కు వాయిదా (Postpone) వేయాలని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ అధికారిక ప్రకటనే అసలు నిజానిజాలను స్పష్టం చేయనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment