‘పెద్ది’ కోసం రామ్ చరణ్ సరికొత్త లుక్

'పెద్ది' కోసం రామ్ చరణ్ సరికొత్త లుక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌తో రాబోతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్, మల్టీ-స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పాత్ర విభిన్న షేడ్స్‌లో ఉంటుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాలోని మరొక కీలక లుక్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు.

ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం, రామ్ చరణ్ కొత్త రూపాన్ని తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకున్నారు. ఈ లుక్ రామ్ చరణ్ స్టైల్, స్వాగ్‌ను సరికొత్తగా, ప్రేక్షకులు ఊహించని విధంగా చూపిస్తుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment