వివాదంలో రాజమౌళి.. చిక్కుల్లో ‘వారణాసి’..!!

వివాదంలో రాజమౌళి.. చిక్కుల్లో ‘వారణాసి’..!!

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తన కొత్త ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi)ప్రారంభోత్స‌వంలో చేసిన వ్యాఖ్య‌ల‌తో ఊహించని వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై మంటలు రేగుతుండగా, ఇప్పుడు కొత్తగా సినిమా టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఈ సమస్యల వల్ల రాజమౌళి ప్రాజెక్ట్ చుట్టూ గంద‌ర‌గోళ‌ పరిస్థితులు నెలకొన్నాయి.

హనుమంతుడిపై వ్యాఖ్యలతో..
ఇటీవల జరిగిన వార‌ణాసి టైటిల్ రివీల్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ, తన తండ్రి “సినిమాను హనుమంతుడే (Hanuman) చూసుకుంటాడు. టెక్నిక‌ల్ ఇష్యూతో గ్లింప్స్ రిలీజ్ ఆగిన‌ప్పుడు ఇలాగేనా న‌డిపించేది అని కోప‌మొచ్చింది. నా భార్య ర‌మా (Rama) కూడా హ‌నుమంతుడితో ఫ్రెండ్‌లా మాట్లాడుతుంది. కానీ ఇలా ఎందుకు అయ్యింది అని కోప‌మొచ్చింది’’, ఎందుకంటే దేవుడిపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ వానరసేన రాజమౌళిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వానరసేన ఆరోపణల ప్రకారం,
రాజమౌళి హనుమంతుడిపై “జుగుప్సాకరమైన” వ్యాఖ్యలు చేశారని, దేవుళ్ల పేర్లు వాడుకుని సినిమా పబ్లిసిటీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, మతాల మధ్య విద్వేషం రగిలించే ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, అతడిపై కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

‘వారణాసి’ టైటిల్‌పై కొత్త ఫిర్యాదు
రాజమౌళి కొత్త సినిమాకు ప్రతిపాదించిన ‘వారణాసి’ టైటిల్‌పై కూడా వివాదం తలెత్తింది. రామ భక్త హనుమ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ, ఈ టైటిల్‌ను తాము ముందే ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నామని ఆరోపించింది. తమ అనుమతి లేకుండా అదే పేరుతో రాజమౌళి సినిమా చేయడం అన్యాయమని, టైటిల్‌ను వెంటనే రద్దు చేయించాలని ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.

క్రమంగా పెరుగుతున్న ఒత్తిడి
ఒకే సమయంలో రెండు పెద్ద సమస్యలు రాజమౌళి ముందుకు రావడంతో సినిమా యూనిట్‌ ఆందోళన చెందుతోంది. హిందూ సంఘాల నుంచి నిరసనలు, పోలీసు ఫిర్యాదులు, టైటిల్ హక్కులపై వివాదం ఇవన్నీ కొత్త ప్రాజెక్ట్‌కి పెద్ద సవాలుగా మారాయి. రాజమౌళి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు కావడంతో, ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదాలు ఏ దిశగా దారి తీస్తాయో అన్నదానిపై సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment