కూలీ సినిమాకు లోకేష్ భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే..

కూలీ సినిమాకు లోకేష్ భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే..

సూపర్ స్టార్ (Super Star) రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ‘జైలర్’ (Jailer) సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తలైవా, ప్రస్తుతం ‘కూలీ’ (Coolie)  చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘జైలర్’ సినిమాతో ఘన విజయం అందుకున్న రజినీకాంత్, ‘కూలీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గని ఉత్సాహంతో యువ హీరోలకు దీటుగా నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), శ్రుతి హాసన్ (Shruti Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. రజినీ కెరీర్‌లో 171వ చిత్రంగా రూపొందుతున్న ‘కూలీ’ గురించి నిరంతరం కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సినిమా బడ్జెట్, పారితోషికాలపై ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రజినీకాంత్‌కు ఈ చిత్రం కోసం రూ.150 కోట్ల పారితోషికం (Remunerations) ఇస్తున్నారని, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతుందని టాక్. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా నిర్మాణం, ఇతర నటీనటుల పారితోషికాలను కవర్ చేస్తున్నారట. అలాగే, సినిమా పబ్లిసిటీ కోసం రూ.25 కోట్లు వెచ్చించే యోచనలో ఉన్నారని సమాచారం. మొత్తంగా, సినిమా బడ్జెట్ రూ.375 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది రజినీ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రంగా నిలుస్తుంది.

ఫ్యాన్స్ ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ (Digital Streaming) హక్కులను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టు 14న ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment