డేవిడ్ వార్న‌ర్‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు

డేవిడ్ వార్న‌ర్‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు

వ‌య‌సు, సినియార్టీని మ‌రిచి నోటి దురుసుతో తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ దిగొచ్చారు. రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా నుంచి విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త రావ‌డంతో దిగొచ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇటీవ‌ల కాలంలో సినిమా ఈవెంట్లలో కొందరు చేస్తున్న వ్యాఖ్య‌లు తీవ్ర వివాదంగా మారుతున్నాయి.

రాబిన్‌హుడ్ సినిమా ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌ను ఉద్దేశించి నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వార్న‌ర్ ఫ్యాన్స్‌, సినిమా ల‌వ‌ర్స్ రాజేంద్ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. వార్నర్ అభిమానులంతా ఆయనపై ఫైర్ అయ్యారు. త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ వీడియో విడుద‌ల చేశారు.

సినిమా ఈవెంట‌లో డేవిడ్ వార్నర్‌ మీద అనుకోకుండా నా నోటి నుంచి ఓ మాట దొర్లింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ ఫంక్షన్‌కి వచ్చే ముందు మేమంతా కలిసి ఎంతో అల్లరి చేశాము. నితిన్‌ని అతన్ని(వార్నర్) మీరంతా నా పిల్లల్లాంటోళ్లు అని అన్నాను. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్, వార్నర్ లవ్స్ అవర్ ఫిలిమ్స్. అయినప్పటికీ.. ఎవరి మనస్సైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను. ఇంకోసారి నా నుంచి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. కానీ, 28వ తేదీన రాబిన్‌హుడ్ సినిమా మాత్రం అందరూ తప్పక చూడాలి అని అని రాజేంద్రప్రసాద్ వీడియోలో కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment