రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనీర్ జిల్లా దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ కారుపై భారీ ట్రక్కు ట్రాలీ పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది.
వివాహం నుంచి వస్తూ విషాదం
బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా దేశ్ నోక్ ఫ్లైఓవర్ వద్ద ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయి కారుపై బోల్తా కొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. అందులోని ఆరుగురు ప్రయాణికులు తీవ్రగాయాలతో మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్, మూడు జేసీబీల సహాయంతో ట్రాలీని తొలగించారు. అయితే అప్పటికే కారులో ఉన్నవారంతా మరణించారని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతానికి మృతుల వివరాలు తెలియరాలేదు.







