షాకింగ్‌.. ఐసీయూలోని పేషెంట్‌పై అత్యాచారం

షాకింగ్‌.. ఐసీయూలోని పేషెంట్‌పై అత్యాచారం

కామ‌వాంఛ‌తో క‌న్నూమిన్నూ కాన‌కుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్‌లో అమాన‌వీయ సంఘ‌ట‌న ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అల్‌వార్ (Alwar)లోని ESIC మెడికల్ కాలేజ్ (ESIC Medical College) ICUలో చేరి చికిత్స పొందుతున్న‌ మహిళపై అదే కాలేజీలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది అత్యాచారం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు 32 ఏళ్ల మహిళ. చికిత్స కోసం ఆమె ఐసీయూలో చేరగా, నర్సింగ్ సిబ్బంది ఆమెకు ముందుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను అత్యాచారం చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాస్పిటల్ సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన కాలేజీ డీన్ డాక్టర్ అసీమ్ దాస్ (Dean Dr. Aseem Das), నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ దారుణానికి నిందితులెవరో గుర్తింపు ప్రక్రియలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించామని అధికారులు తెలిపారు. మానవతా విలువలు కాపాడాల్సిన ఆసుపత్రిలోనే ఇలాంటి దారుణాలు జరగడం ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment