‘దోచుకో.. పంచుకో.. తినుకో..’ రాజంపేట‌లో స‌జీవ సాక్ష్యం

'దోచుకో.. పంచుకో.. తినుకో..' రాజంపేట‌లో స‌జీవ సాక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో “దోచుకో.. పంచుకో.. తినుకో” అన్న చందంగా సాగుతున్న పాలనకు రాజంపేట ఉదంతం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కూట‌మి పాల‌న అవినీతిపై జ‌గ‌న్ చెప్పింది నిజ‌మని ఈ విష‌యం తెలిసినవారంతా నివ్వెర‌పోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒక నిరుపేద వ్య‌క్తి తన కన్ను కోల్పోయి, తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ‌గా, ప్రభుత్వం నుంచి అందిన సాయంలో సగానికి పైగా వాటా కొట్టేసిన టీడీపీ నేతల తీరు సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఆపదలో అందిన సాయంపై ‘రాబందుల’ కన్ను
వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తన కంటిని కూడా కోల్పోయారు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి సాయం కోరగా, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద 14 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

దగా జరిగిందిలా..
సహాయం అందిస్తామని నమ్మబలికిన స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. తమ పలుకుబడితోనే ఈ నిధులు వచ్చాయని నమ్మించి, అతని వద్ద సంతకాలు తీసుకున్నారు. అమాయకుడైన ఎల్లయ్య వారు చెప్పినట్లు సంతకాలు చేసి ఇంటికి వెళ్లారు. అయితే, కొద్దిసేపటికే తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లు చూసి ఆయన గుండె ఆగినంత పనైంది.

రూ. 14 లక్షలు ఎల్లయ్య ఖాతాలో జమ అయ్యాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే, ఆ ఖాతా నుండి రూ. 8 లక్షలు టిఎన్‌ఎస్‌ఎఫ్ (TNSF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఇదేంట‌ని ఎల్ల‌య్య అడిగితే.. “మాకు ఖర్చులు ఉంటాయి.. పైన అందరికీ పర్సెంటేజీలు ఇవ్వాలి” అంటూ టీడీపీ నేతలు బాధితుడిని బెదిరించడం వారి అవినీతి చ‌ర్య‌కు అద్దం పడుతోంది.

అవినీతిలో నవ శకం?
రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక, మట్టి, భూకబ్జాలు, కాంట్రాక్టుల ద్వారా దోపిడీ సాగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో, పేదవాడి సొమ్మును కూడా వదలకపోవడంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు బలం చేకూర్చేలా రాజంపేటలో జరిగిన ఈ సంఘటన అత్యంత దిగ్భ్రాంతికరం అంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు అండగా ఉండాల్సిన ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ (CMRF) నిధుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వాటాలు వెతుక్కోవడం పరాకాష్ట.

Join WhatsApp

Join Now

Leave a Comment