గైట్ కాలేజీలో విషాదం.. ఉరివేసుకొని విద్యార్థిని మృతి

రాజమండ్రి గేట్ వర్సిటీలో విషాదం.. ఉరివేసుకొని విద్యార్థిని మృతి

ఇంటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ (Engineering College)కి వెళ్లిన విద్యార్థి మ‌రుస‌టి రోజే హాస్ట‌ల్ గ‌దిలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న రాజమండ్రి (Rajahmundry)లోని గైట్ కాలేజీ (GIET College)లో సంచ‌ల‌నం సృష్టించింది. మృతిపై విద్యార్థులు, బాధిత త‌ల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా (Nellore District) నరసాపురం (Narasapuram) గ్రామానికి చెందిన పరుచూరి ప్రగతి (Paruchuri Pragathi) (19) అనే బీటెక్ (సీఎస్ఈ) మొదటి సంవత్సరం చ‌దువుతోంది. ఆదివారం ఇంటికి వచ్చిన ప్రగతి, సోమవారం హాస్టల్‌ (Hostel)కు తిరిగి వెళ్లింది. అయితే, ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకొని (Hanging) ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌ (Suicide Note)లో ఆమె మొదటి సెమిస్టర్‌లో నాలుగు సబ్జెక్టులు మిగిలాయని, దీని వల్ల మనస్తాపం (Depression)తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసినట్లు తెలిపారు.

అయితే, ప్రగతి తండ్రి ఈ ఘటన సహజమైన ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై తల భాగంలో గాయాలు, ముక్కు నుంచి రక్తస్రావం ఉండటం ఈ కేసును మరింత అనుమానాస్పదంగా మార్చాయి. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై నిష్పక్షపాతమైన విచారణ జరిపి, పూర్తి సత్యాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

పోస్టుమార్టం, విచారణ
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసులు వెంటనే స్పందించి, ఈ ఘటన వెనుక ఉన్న నిజాలను బయటపెట్టాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment