బీజేపీలో చేరారో జాగ్ర‌త్త‌.. – రాజాసింగ్ హెచ్చరిక

బీజేపీలో చేరారో జాగ్ర‌త్త‌.. - రాజాసింగ్ హెచ్చరిక

తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) అధ్య‌క్షుడి (President’s) ఎన్నిక‌ల (Elections) సంద‌ర్భంగా అంత‌ర్గ‌త విభేదాల‌తో పార్టీని వీడిన గోషామ‌హ‌ల్ (Goshamahal) ఎమ్మెల్యే(MLA) రాజాసింగ్ (Raja Singh) ఆ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా బీజేపీలో చేరాలని భావిస్తున్న వారికి గట్టి హెచ్చరిక (Warning) జారీ చేశారు. పార్టీలోకి అడుగుపెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని, మరికొన్ని రాసి పెట్టుకోవాలని సూచించారు. నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి వంటి నాయకులు బీజేపీలో చేరి మళ్లీ ఎందుకు వెళ్లిపోయారో ఆలోచించాలని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత మీ నియోజకవర్గంలో మీరు ఊహించినట్లు ఏం జరగదని, మీతో వచ్చిన కార్యకర్తలకు పదవులు దక్కవని, మీకే టికెట్ వస్తుందన్న హామీ ఉండదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

ప్రారంభంలో ఫస్ట్ సీట్లో ఉంచి, తర్వాత మెల్లగా లాస్ట్ సీట్లోకి నెట్టేస్తారని అన్నారు. తెలంగాణ బీజేపీలో కొంతమంది “రాక్షసులు” ఉన్నారని, ఈరోజు కాకపోయినా రేపటికి ఆ రాక్షసులు నాశనం అవుతారని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరే ముందు ఆలోచన చేసి, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment