పార్టీ కార్యకర్తలు కూలీలుగా ఉండిపోవాలా?

పార్టీ కార్యకర్తలు కూలీలుగా ఉండిపోవాలా?

గత 11 ఏళ్లుగా బీజేపీ నేతలు (BJP Leaders) నాతో ఫుట్ బాల్ ఆడుకున్నారంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే(MLA) రాజా సింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత బాధ ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) లాంటి వ్యక్తి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ బహుమతిగా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు కూడా ఇదే విధంగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ బహుమతిగా ఇవ్వడం ఖాయమని అన్నారు.

రాజా సింగ్ మాట్లాడుతూ, “కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు. భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పార్లమెంటులో మీ వ్యక్తులను పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?” అని ప్రశ్నించారు. అలాగే, తన అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి (Kishan Reddy) మనుషులను పెట్టి తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఒకసారి సమీక్షించుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో తమ నాయకులతోనే తాము పోరాడాల్సిన పరిస్థితి ఉందని, బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలతో తమకు పోటీ కాదని రాజా సింగ్ అన్నారు. ఇతర పార్టీల మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు (Ramachandra Rao) అంటున్నారని, ఇది మంచి విషయమే అయినప్పటికీ, బీజేపీలో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. బీజేపీలో ఉన్న కార్యకర్తలకు నిధులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా? బీజేపీ కార్యకర్తలు (BJP Workers) నిరంతరం పార్టీ కోసం కష్టపడి కూలీలుగానే (Labourers) ఉండాలా?” అని రాజా సింగ్ ఘాటుగా ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment