నైజాంలో ‘రాజాసాబ్’ టికెట్లపై ఉత్కంఠ.. ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలు

నైజాంలో ‘రాజాసాబ్’ టికెట్లపై ఉత్కంఠ.. ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలు

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’ (Raja Saab) సినిమా నైజాం (Nizam Area) ప్రాంతంలో అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నా ఇప్పటికీ తెలంగాణలో టికెట్ల బుకింగ్ ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడకపోవడమేనని సమాచారం.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ‘రాజాసాబ్’ నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణ వ్యయం భారీగా ఉండటంతో, కొంతమేర టికెట్ ధరల పెంపుర‌కు వెసులుబాటు కల్పించాలని వారు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, గతంలో టికెట్ ధరల పెంపుపై వచ్చిన వివాదాలు, న్యాయస్థానాల్లో సాగుతున్న వాదనల నేపథ్యంలో ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి పునరాలోచిస్తున్నట్లు సమాచారం.

ఇక సినిమా టికెట్ ధరల విషయంలో ఇప్పటికే కోర్టుల్లో పలు పిటిషన్లు, వాదనలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే నైజాంలో ‘రాజాసాబ్’ టికెట్ల బుకింగ్ ఇంకా తెరుచుకోలేదు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ‘రాజాసాబ్’ ప్రీమియర్ షో (Raja Saab Premier Shows)లకు అనుమతి ఇచ్చినట్టే కాకుండా, టికెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీలో బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.

ఇక తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు వస్తుందోనన్న ఉత్కంఠతో నైజాం అభిమానులు ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందు టికెట్ ధరలపై స్పష్టత రావాలని, ఆలస్యం కాకుండా బుకింగ్ ఓపెన్ చేయాలని సినీ వర్గాలు, అభిమానులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment