కూటమిలోని జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన వికృత చేష్టలకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. శాసనసభ సభ్యుడినన్న కనీస ధ్యాస లేకుండా, చట్టసభ ప్రాంగణంలోనే ఆయన అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారని బాధిత మహిళ బహిర్గతం చేసిన వీడియోలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బాధిత మహిళ స్వయంగా విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల సమయంలో అరవ శ్రీధర్ అసెంబ్లీలో ఉండగానే ఆమెకు వీడియో కాల్ చేశారని తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు హాజరైన సమయంలోనే, అసెంబ్లీ ప్రాంగణం నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడిన ఆయన, ఆపై టాయిలెట్‌లోకి వెళ్లి మరింత వికృతంగా ప్రవర్తించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఆ వీడియోలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శరీరంలోని ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అసభ్యకర సైగలు చేసినట్లు, అభ్యంతరకర పదజాలంతో మహిళను వేధించినట్లు బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా, అసెంబ్లీ టాయిలెట్ నుంచే వీడియో కాల్ ద్వారా ముద్దులు పెట్టిన దృశ్యాలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అరవ శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధిత మహిళ ఇప్పటికే ఆధారాలతో సహా వెల్లడించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇన్ని ఆధారాలు బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అంటూ ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం చేయాలని, ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.








‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’