మెగా కాంపౌండ్ సీనియర్ నటుడు నాగబాబు కుమార్తెతో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్న వీడియో వివాదాస్పదంగా మారింది. నాగబాబు కుమార్తె కొణిదెల నిహారికను దగ్గరకు తీసుకొని ఆమె నడుముపై చెయ్యి వేసి ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిహారిక కలిసింది. ఆ సందర్భంలో ఆమెను దగ్గరకు తీసుకొని నడుముపై చెయ్యి వేసి మాట్లాడుతున్నాడు. రాఘవేంద్రరావు గట్టిగా నొక్కి పట్టుకోవడంతో వెంటనే నిహారిక తన నడుము పైనుంచి చెయ్యి తీసేందుకు ప్రయత్నించింది. వెనక్కి వెళ్లి మళ్లీ మాట్లాడింది. రాఘవేంద్రరావు ప్రవర్తనతో నిహారిక ఇబ్బందిపడినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, దీనిపై మెగా, సినీ అభిమానులు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మండిపడుతున్న మెగా ఫ్యాన్స్, నెటిజన్లు
తన సినిమాల్లో ఆడవాళ్లను చాలా బోల్డ్‌గా చూపించే రాఘవేంద్రరావు.. బయట కూడా ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై మెగా ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వయస్సులో ఇదేం పని రాఘవేంద్రరావు అంటూ మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికే ఇలా అంటే.. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళ పరిస్థితి అర్థం అవుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఒక ఆడపిల్ల పట్ల ఇలా అసభ్యకర్తంగా ప్రవర్తించవచ్చా..? అని ప్రశ్నిస్తున్నారు. నీలాంటి వ్యక్తిని ఎస్వీబీసీ చైర్మన్‌గా గతంలో ఎలా నియమించారని నిలదీస్తున్నారు. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదు కానీ, ఇలాంటి వికృత చేష్టలకు, విలువలు లేని మనుషులకు తాము వ్యతిరేకం అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
🚨Netizens are criticizing the inappropriate behavior of senior Tollywood director after a recent video showed producer-turned-actress #Niharika appearing visibly uncomfortable.#Tollywood
— Bharat Media (@bharatmediahub) November 10, 2025
pic.twitter.com/MdoBbZiBnG








