లారెన్స్ యాక్షన్ అడ్వెంచర్.. ‘బుల్లెట్టు బండి’ టీజర్ హల్‌చల్

లారెన్స్ యాక్షన్ అడ్వెంచర్.. ‘బుల్లెట్టు బండి’ టీజర్ హల్‌చల్

యాక్షన్, సస్పెన్స్‌ మేళవింపుతో ప్రేక్షకులను రంజింపజేయడానికి రాఘవా లారెన్స్ (Raghava  Lawrence)  హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’ (Bullet Bandi). ఇన్నాసి పాండియన్ (Pandian)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

టీజర్ ప్రారంభంలోనే “జీవితంలో కొన్ని చిక్కుముడులకు సమాధానం ఎప్పటికీ దొరకదు” అని లారెన్స్ చెప్పిన డైలాగ్ సస్పెన్స్‌కి నాంది పలికింది. స్టైలిష్ విజువల్స్, పకడ్బందీగా రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలసి సినిమా వాతావరణాన్ని మరింత హుషారుగా మార్చాయి. విజువల్ ప్రెజెంటేషన్‌లో ఉన్న గ్రిప్, లారెన్స్ ఎనర్జీ, థ్రిల్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాపై అంచనాలను మ‌రింత‌ పెంచుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్లలో రక్తికట్టే అనుభూతిని అందించబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ త్వరలోనే విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment