అందం, అభినయంతో టాలీవుడ్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హీరోయిన్ రాశీ ఖన్నాకు (Raashi Khanna) సంబంధించి వార్త ఒకటి అభిమానులను షాక్‌కు గురిచేసింది. రాశీకి రక్త గాయాలు (Blood Injuries) అయిన ఫొటోలు (Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాశీ ఖన్నా ‘ఫర్జీ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. కాగా, కథ అవసరాల కోసం రిస్కీ(Risky) యాక్షన్ సీన్స్ (Action Scenes)లో పాల్గొనగా రాఖీకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ‘ది సబర్మతి రిపోర్ట్’తో ప్రశంసలు అందుకున్న రాశీ, ఈ గాయాల గురించి ఇలా పోస్ట్ చేశారు. “కథ డిమాండ్ చేస్తే గాయాలను లెక్క చేయకూడదు. కొన్నిసార్లు ఈ గాయాలు శరీరం, శ్వాసపై ప్రభావం చూపొచ్చు.” ఈ గాయాలు చిన్నవేనని ఆమె స్పష్టం చేశారు.
రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు తెలుగు, తమిళ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 2013లో హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తో తెరంగేట్రం చేసిన ఆమె, హిందీలో అవకాశాలు కలిసి రాకపోవడంతో సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2022లో ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’ వెబ్ సిరీస్‌తో అజయ్ దేవగన్‌తో కలిసి హిందీలో రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా కనిపించనుంది.