భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. శనివారం, సింధు తన తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22న జరగనున్న తన వివాహానికి హాజరు కావాలని సీఎంకు ఆహ్వానపత్రిక అందజేశారు. సింధు వెంట తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఉన్నారు.
పీవీ సింధు, వెంకటదత్తసాయి వివాహ వేడుక రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుండగా, సింధు వ్యక్తిగతంగా ముఖ్యమైన అతిథులను ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఆసక్తి..
పీవీ సింధు వివాహం క్రీడా ప్రపంచం నుండి సాధారణ ప్రజల వరకు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉదయపూర్ ప్యాలెస్‌లో జరిగే ఈ పెళ్లి వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.