ఘ‌నంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..

బ్యాడ్మింట‌న్ సూప‌ర్ స్టార్ పీవీ సింధు నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో సింధు ఎంగేజ్‌మెంట్ వేడుక‌గా జ‌రిగింది. వీరిద్ద‌రూ రింగ్స్ మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా “ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి” అని ఒక పోస్టును విడుద‌ల చేశారు.

బ్యాడ్మింట‌న్‌ దిగ్గ‌జం సింధు తన కాబోయే భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ఈ ప్రత్యేక సమయాన్ని అభిమానులతో పంచుకున్నారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్లో జరగనుందని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment