రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కొనసాగుతున్న సందర్భంలో రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పుతిన్‌ను ఆహ్వానించారు. అనంతరం పుతిన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

ఇరు దేశాల ఉన్నతాధికారులు పరస్పరం పరిచయాలు చేసుకున్న తర్వాత, పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడినుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించి, రష్యా ప్రభుత్వ ఛానల్‌ను భారత్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు. రాత్రి రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొని, అనంతరం రాత్రి 9 గంటలకు రష్యాకు తిరుగు ప్రయాణం కానున్నారు.

ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు కీలకంగా నిలవనున్నాయి. ముఖ్యంగా 2 బిలియన్ డాలర్ల విలువైన జలాంతర్గాముల లీజు ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా ముడి చమురు దిగుమతులు, రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాల కల్పనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార మరియు వినియోగ వస్తువుల ఎగుమతులను విస్తరించే అంశంపై కూడా ఒప్పందాలు కుదిరే దిశగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment