ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌పై ఉగ్ర‌దాడి.. కారులో భారీ పేలుడు? (VIDEO)

పుతిన్ కారులో భారీ పేలుడు.. ఉగ్ర‌దాడేనా? (VIDEO)

మాస్కో (Moscow) నడిబొడ్డున రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అధికారిక లిమోజిన్‌లో భారీ పేలుడు (Massive Explosion) సంభవించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పుతిన్ భద్రతకు సంబంధించిన అనేక అనుమానాలు రేకెత్తించిన ఈ ఘటన హత్యాయత్నమా? అన్న ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చింది.

ఈ లగ్జరీ లిమోజిన్ కారు (Limousine Car) ను రష్యా ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టత లేకపోయినా, ఇది ఒక ఉద్దేశపూర్వక దాడి అయ్యుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రపంచ నేతలు, భద్రతా నిపుణులు ఈ సంఘటనను గమనిస్తూ, దీని వెనుక ఉన్న అసలు మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించడంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటన రష్యా రాజధాని మాస్కోలోని లుబియాంకా (Lubyanka) ఏరియాలో ఉన్న రష్యా గూఢచార సంస్థ ఎఫ్‌ఎస్బీ (FSB) సెంట్ర‌ల్ ఆఫీస్‌ సమీపంలోనే జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment