సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోన్న భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా పుష్ప-2 నిలవబోతోంది. సంక్రాంతి బరిలోకి అకస్మాత్తుగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ వైడ్‌గా భారీ హిట్ సొంతం చేసుకున్న పుష్ప-2 సినిమాను మరింత కొత్తగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అదనంగా 20 నిమిషాల సన్నివేశాలు జోడిస్తూ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ తెలిపింది. పుష్ప-2 ఎంట్రీ ఇవ్వడంతో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు భారీ షాక్ తగిలినట్లు అయ్యింది.
ఈనెల 11వ తేదీన 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప-2 సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 20 నిమిషాల సీన్స్ యాడ్ అవ్వడంతో సినిమా డ్యూరేషన్ 3 గంటల 45 నిమిషాలకు చేరుతుంది. యాడ్ చేసే కొత్త సన్నివేశాలు ఎలా ఉంటాయోనని ప్రేక్షకులు, బన్నీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పాటు, ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు షాక్ ఇస్తూ అకస్మాత్తుగా పుష్ప-2 సంక్రాంతి బరిలోకి దిగింది. అదనపు సన్నివేశాలతో విడుదలవుతున్న పుష్ప-2కు ప్రేక్షకులు తరలివెళ్తారనే భయం ఆ మూడు సినిమాల మేకర్స్‌కు ఉన్నట్లు తెలుస్తోంది.